ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
10 మంది మావోయిస్టుల మృతి
NEWS Sep 11,2025 10:29 pm
ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్. సుక్మ జిల్లా గరియాబాద్‌లో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టు లు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మనోజ్ కూడా అలియాస్ మొడెం బాలకృష్ణతో పాటు ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు SZCM ప్రమోద్ అలియాస్ పాండు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. 10 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయాని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ తెలిపారు.