ఘనంగా చుంచుపలో టీఎల్ఎం మేళా
NEWS Sep 11,2025 09:21 pm
చుంచుపల్లి మండల టీఎల్ఎం మేళా బాబు క్యాంప్ జిహెచ్ఎస్ పాఠశాలలో జరిగింది. మండల ఎంఇఓ బి.బాలాజీ, కాంప్లెక్స్ హెచ్ఎం నీరజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్‌ను పరిశీలించారు. టీఎల్ఎం పోటీలలో ఎంపియుపిఎస్ పెనుబల్లి పాఠశాలకి చెందిన ఎం.విజయ, ఎం.రాజయ్య, ఎంపిపిఎస్ రామ్‌నగర్‌కు చెందిన వెంకటరమణ, ఎంపిపిఎస్ వెంకటేశ్వర కాలనీకి చెందిన మీనాకుమారి మొదటి బహుమతులు గెలుచుకున్నారు. వీరు జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాకు ఎంపికైనట్లు ఎంఇఓ బాలాజీ తెలిపారు.