అంగన్వాడి సెంటర్‌లో సృజనాత్మక కార్యక్రమం
NEWS Sep 11,2025 09:14 pm
మెట్‌పల్లి పట్టణంలోని ఇంద్రనగర్ అంగన్వాడి సెంటర్‌లో ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రతిభ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె పిల్లల్లో సృజనాత్మకత పెంచేందుకు మొక్కలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్క బొమ్మను దించి, పిల్లలు తీసుకొచ్చిన మొక్క భాగాలను ఆ బొమ్మపై అమర్చేలా ప్రోత్సహించారు. అలాగే ఆకులు, కొమ్మలు, మొక్క భాగాలను గుర్తుపట్టేలా పిల్లలతో పలకరించి, వాటి పేర్లు చెప్పేలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి, ఆయా పద్మ, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.