ఈ నెల 17 వరకు పెన్షన్ విద్రోహ దినం
NEWS Sep 11,2025 04:20 pm
అనంతగిరి మండలంలో ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఏపిటిఎఫ్ గురువారం నుంచి నిరసన వారం ప్రారంభించింది. ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో పాఠశాలల్లో నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి డి. సన్యాసి రావు మాట్లాడుతూ – ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, గద్దె నెక్కి 15 నెలలు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 17 వరకు వారం రోజులపాటు ప్రతిరోజు విభిన్న రకాలుగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.