ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు గడువు ముగియడంతో గురువారం ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ అయ్యారు. అయిదు రోజుల తర్వాత తను తిరిగి ఇక్కడికి వచ్చారు. లిక్కర్ స్కాంలో కీలకమైన నిందితుడిగా ఏపీ సిట్ పేర్కొంది. ఈ మేరకు నివేదిక కూడా తయారు చేసింది.