గత 15 ఏళ్లుగా ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం కోసం నిరంతరం పోరాటం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కమిటీని నియమించి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఫలితం కనబడలేదని మండిపడ్డారు.