అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన రాజ్మా విత్తనాలు అందరికీ అందజేయాలని ఆదివాసీ పరిరక్షణ సమితి అనంతగిరి మండల అధ్యక్షులు సోమేల స్వామి డిమాండ్ చేశారు. కొందరు సరి పోవడం లేదని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అగ్రికల్చర్ అధికారులు స్పందించి రాజ్మా విత్తనాలు ఎవరికైతే సరిపోలేదో వారికి అందించాలని కోరారు.