ఘనంగా ఆచార్య వినోభా భావే జయంతి
NEWS Sep 11,2025 09:46 pm
అనకాపల్లి జిల్లా సింహాచలం మినర్వా పాఠశాలలో భూదానోద్యమ పితామహుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య వినోబా భావే 130వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సర్వోదయ మండల్, అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి, ప్రిన్సిపాల్ గేదెల సోమేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.