రామయ్యను దర్శించుకున్న నాగరిగారి ప్రీతం
NEWS Sep 11,2025 09:41 pm
తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికగా, రామయ్య మూల విరాట్‌ను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో గల లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు శాలువాతో సత్కారం చేశారు.