ఉచిత పశువైద్య శిబిరం
NEWS Sep 11,2025 09:13 pm
మెట్‌పల్లి: ఆరపేట గ్రామంలో జాతీయ సేవా పథకంలో భాగంగా పశువైద్య & పశుసంవర్థక శాఖ, పశువైద్య కళాశాల కోరుట్ల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్, మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు. ఆవులు, గేదెలకు పరీక్షలు, గర్భకోశ వ్యాధి, పొదుగు వాపు వంటి సమస్యలకు చికిత్సలు అందించారు. అలాగే గొర్రెలు, మేకలకు మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.