ASR: రాళ్ళగెడ్డలో వంతెన నిర్మించండి
NEWS Sep 11,2025 09:45 pm
అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ రాళ్లగడ్డ గ్రామ గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడిచినా తమ జీవితం మారలేదని, కనీస రోడ్డు సౌకర్యం, వంతెన లేకపోవడం దారుణమని వాపోయారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, నిరసనలు, ధర్నాలు చేసినా అధికారులూ, రాజకీయ నాయకులూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.