గ్రూప్ -1 పరీక్ష రద్దు చేయాలని నిరసన
NEWS Sep 11,2025 04:21 pm
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఓయూ లైబ్రరీ వద్ద నిరసనకు దిగారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణలో అనేక అవతవకలు చోటు చేసుకున్నాయని, రీ వాల్యూయేషన్ చేయాలని, తిరిగి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువ రించింది. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం కారణంగా అభ్యర్థులు తీవ్రంగా నష్ట పోయారన్నారు బీఆర్ఎస్వీ నేతలు.