బ్లాక్ మార్కెట్ లో యూరియా
NEWS Sep 11,2025 04:14 pm
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇప్పటి వరకు సర్కార్ స్పందించక పోవడం దారుణమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి గోదాముల్లో యూరియాను అక్రమంగా నిలువ చేసుకుంటున్నారని ఆరోపించారు. రూ.275కు రావాల్సిన బస్తా బ్లాక్ మార్కెట్లో రూ.800కు అమ్ముకుంటున్నారని , చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.