పూర్తి కాని పంచాయతీ కార్యాలయం
NEWS Sep 11,2025 09:49 pm
పినపాక మండలం బోటుగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణం సంవత్సరం దాటినా పూర్తి కాలేదు. పునాది, పిల్లర్ల వరకు మాత్రమే పనులు చేసి ఆగిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన సులభం కావాలని ప్రతి గ్రామపంచాయతీకి ప్రభుత్వం కొత్త భవనాలు కేటాయించినప్పటికీ బోటుగూడెం కార్యాలయం మాత్రం అర్ధాంతరంగా నిలిచిపోయిందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులను పూర్తి చేసి గ్రామానికి సౌకర్యవంతమైన పంచాయతీ కార్యాలయం అందించాలని కోరుతున్నారు.