త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం
NEWS Sep 11,2025 02:49 pm
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. అమెరికా 50 శాతానికి పైగా భారత్ పై టారిఫ్స్ విధించిన నేపధ్యంలో తీపి కబురు చెప్పారు. వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చేసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.