తిరుపతి ప్రెస్ క్లబ్ కు ఎంతైనా సాయం చేస్తాం
NEWS Sep 11,2025 12:32 pm
తిరుపతి ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ రూ. 10 లక్షలు ప్రెస్ క్లబ్ ఆధునీకరణ కోసం కేటాయించింది. అధునాతన ఫర్నిచర్, ఏసీలు, వాటర్ ప్లాంట్, టీవీలు ఇందులో ఏర్పాటు చేశారు. తాను కూడా మీలో ఒకడినేనని అన్నారు నాయుడు. ప్రెస్ క్లబ్‌కు ఏ అవసరమొచ్చినా సహాయం చేస్తామని ప్రకటించారు. దేవ దేవుడు వెంకటేశ్వర స్వామి కొలువు దీరాడు కాబట్టే తిరుపతికి అత్యంత ప్రాధాన్యత వచ్చిందన్నారు. తిరుమలను కాపాడు కోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఫేక్ వార్తలు ప్రచురించ వద్దని కోరారు.