గ్రూప్ -1 ఉద్యోగాలను అమ్ముకున్నారు
NEWS Sep 11,2025 09:15 am
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పరీక్షలలో అవకతవకలు జరిగాయని హైకోర్టు తేల్చిందని, వెంటనే రద్దు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఒక్కో పోస్టును రూ. 3 కోట్లకు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కోరారు.