గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేయాలి
NEWS Sep 11,2025 09:11 am
నిరుద్యోగుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. హైకోర్టు ఆదేశాలను బేషరతుగా పాటించి గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద లాయర్లతో సుప్రీంకోర్టుకి వెళ్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు కోసినట్టేనని మండిపడ్డారు . గ్రూప్-1 అవకతవకల వెనుక ఎవరున్నారో విచారణ చేసి, దీని వెనుక ఉన్న దోషులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.