యుఏఈకి షాక్ భారత్ ఝలక్
NEWS Sep 11,2025 08:59 am
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025లో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు యూఏఈకి చుక్కలు చూపించింది భారత్. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుల్దీప్ యాదవ్ , శివమ్ దూబే బౌలింగ్ తో బెంబేలెత్తించారు. ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. భారత్ టైటిల్ హాట్ ఫెవరేట్ గా ఉంది. ఎట్టకేలకు సంజూ శాంసన్ ను వికెట్ కీపర్ గా వాడుకున్నాడు హెడ్ కోచ్. జితేశ్ శర్మ 30 రన్స్ చేస్తే, గిల్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.