తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 4నుంచి తిరిగి సాధారణ తరగతులు పునప్రారంభం కానున్నాయి. ఇక సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.