కొండగట్టు బస్సు ప్రమాదం: నేటికి ఏడేళ్లు
NEWS Sep 11,2025 11:50 am
కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగి నేటితో ఏడేళ్లు పూర్తయింది. దాదాపు 108 మంది ప్రయాణికులతో కొడిమ్యాల నుంచి కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడి 24 మంది ఘటనా స్థలంలో, 41 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడి ఇంకా కొందరు జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఈ ఘటనతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. దేశ చరిత్రలోనే ఈ ఘటన అతిపెద్ద ప్రమాదకరంగా నిలిచింది.