జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో హైనా సంచారం కలకలం రేపింది. మల్యాల వ్యవసాయ మార్కెట్లోని గిడ్డంగి భవనం వద్ద అర్ధరాత్రి హైనా ఒక కుక్కపై దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వచ్చి దాని అడుగుల ఆనవాళ్లు సేకరించి హైనా అని నిర్ధారించారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి కొన్ని నెలలుగా పని చేయడం లేదని సిబ్బంది తెలిపారు. హైనా సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.