ప్రమాదకరంగా కోనాపురం రోడ్డు వంతెన
NEWS Sep 11,2025 11:53 am
అనంతగిరి మండలం బొర్రా–కోనాపురం గ్రామ పంచాయతీల మధ్యనున్న పెద్దగెడ్డ వంతెనపై బురద, మట్టి పేరుకుపోవడంతో వంతెనపై నీరు నిల్వవుతోంది. దీంతో వంతెన శిథిలావస్థకు చేరుకుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు ఎదురెదురుగా వెళ్లే సమయంలో బురదకు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి వంతెనపై పేరుకున్న మట్టి, బురద తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదివాసులు కోరుతున్నారు.