గుడ్ టచ్, బ్యాడ్ టచ్ - అవగాహన
NEWS Sep 11,2025 11:52 am
వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళా పోలీసులు విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ చిన్నారావు అధ్యక్షతన విద్యార్థినులతో సమావేశం అయ్యారు. ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం వలన అనర్థాలను షీ టీమ్ సభ్యులు భాను, రుక్మిణి వివరించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. వర్షాలు సీజన్ వల్ల అనారోగ్యం పాలవకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.