అడ్డూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
NEWS Sep 14,2025 04:33 pm
చోడవరం (M) అడ్డూరు సమీపంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. చోడవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బస్సు అడ్డూరు వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.