మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓ వైపు యూరియా అందక రైతులు నానా తంటాలు పడుతుంటే ఇప్పటి వరకు సీఎం స్పందించక పోవడం దారుణమన్నారు. 50కి పైగా ఢిల్లీ బాట పట్టిన సీఎం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఓ వైపు ఏపీకి పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ యూరియా వెళుతుంటే రేవంత్ నిద్ర పోతున్నారా అని నిలదీశారు. ప్రభుత్వం రైతులకు సంబంధించి యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.