ప్రధాన పంచాయతీల్లో ఒకటైన రావికమతం గ్రామంలో వర్షాలు కురుస్తున్న కొద్ది రోజుల్లోనే మురికి నీరు నిల్వై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ కాలువల్లో చెత్తా చెదారం పేరుకు పోవడంతో నీరు ఊరిలో ఎక్కడ పడితే అక్కడ నిలిచి పోవడం గ్రామానికి తలనొప్పిగా మారింది. ఈ సమస్యను గమనించిన పంచాయతీ కార్యదర్శి మోహన్ వెంటనే చర్యలు చేపట్టారు. జెసిబి సహాయంతో కాలువలను శుభ్రం చేయిస్తూ మురికి నీరు నిల్వ ఉండకుండా చూశారు.