ఎన్నికలు నిర్వహించే విధానంలో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఆయన మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఉప ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేని నాయకులు కాంగ్రెస్ వారన్నారు. ఎమ్మెల్యేలు భయపడు తున్నారన్నారు.. కాంగ్రెస్ పార్టీని మరో సారి ఓడించేందుకు ఆయా నియోజకవర్గాల్లో శక్తి వంచన లేకుండా పార్టీ పని చేస్తుందన్నారు.