నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు
NEWS Sep 10,2025 07:58 pm
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలంలో సుమారు 40 గ్రామాలు ఉన్నాయి, ఈ 40 గ్రామాల్లో సుమారు 30 గ్రామాల్లో వీధిలైట్లు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజా ధనం వృధా అవుతోందని వాపోతున్నారు సంబంధిత గ్రామాల ప్రజలు. తక్షణమే అధికారులు స్పందించి వీధి లైట్లు నిరంతరం వెలిగేటట్లు కాకుండా రాత్రి సమయంలోనే వెలిగేలా చర్నిలు తీసుకోవాలని కోరుతున్నారు.