కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS Sep 10,2025 07:58 pm
కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పేదంటి ఆడబిడ్డలకు వరం లాంటిదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మణుగూరు ప్రజా భవన్ లో 67 లక్షల 7 వేల 772 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అద్దంకి నరేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.