టీటీడీ ఈవోగా సింఘాల్ బాధ్యతలు స్వీకరణ
NEWS Sep 10,2025 02:25 pm
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా బంగారు వాకిలిలో గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్రహ్మం.