శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోలు స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే మరాఠా పోలీసులు మేడ్చల్ లో భారీ డ్రగ్స్ తయారీని పట్టుకోవడం కలకలం రేపింది.