బీఆర్ఎస్ నుంచి వేటుకు గురైన మాజీ ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. త్వరలో జరగబోయే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తను పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై స్వంతంగా సర్వే నిర్వహిస్తున్నట్లు టాక్. కవిత బరిలో ఉంటే బీఆర్ఎస్ కు ఎఫెక్టు పడటం మాత్రం ఖాయమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా అందరి ఫోకస్ జూబ్లీ హిల్స్ కావడం విశేషం.