చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే
NEWS Sep 10,2025 10:38 am
మెట్ పల్లి: చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా బండలింగపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం, ధైర్యం, పోరాటానికి ప్రతీకగా నిలిచిన విప్లవ నారి చాకలి ఐలమ్మ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.