ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫోటోను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది అమరావతి హైకోర్టు. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ప్రశ్నించింది ధర్మాసనం. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ కొట్టివేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని సూచించింది.