ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 29న కనకదుర్గమ్మ అమ్మ వారికి సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపింది. సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుండి 4.30 గంటల మధ్య వస్త్రాలు సమర్పిస్తారని తెలిపింది. ఇందు కోసం రూ. 20 వేలు మంజూరు చేసింది. ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 దాకా దసరా ఉత్సవాలు జరగనున్నాయి.