రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఏసీబీ తన విచారణను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను ఇవాళ గవర్నర్ విష్ణు దేవ్ వర్మను కలిసి ఇవ్వనుంది. మాజీ మంత్రి కేటీఆర్ తో సహా మరో నలుగురిని ఇందులో కీలకమైన వ్యక్తులుగా పేర్కొంది. వీరిని విచారించేందుకు అనుమతి కోరనుంది ఏసీబీ. గవర్నర్ ఓకే చెప్పిన వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.