భారత దేశ 17వ ఉప రాష్ట్రపతిగా విజయం సాధించిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోదీ. ఆయన జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. ఈ పదవికి తన పనితీరుతో వన్నె తీసుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు.