ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. ఆర్ఆర్ఆర్ పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-బందర్‌పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలన్నారు. మన్ననూర్ - శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతించాలన్నారు. హైదరాబాద్ - మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారికి ఛాన్స్ ఇవ్వాలని కోరారు.