ఉప రాష్ట్రపతి ఎన్నిక తీర్పును స్వాగతిస్తున్నా
NEWS Sep 10,2025 07:39 am
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలపై లేఖ విడుదల చేశారు బరిలో నిలిచి ఓటమి పాలైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు.. ఈ ప్రయాణం నాకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చిందన్నారు. న్యాయం, ప్రతీ వ్యక్తి గౌరవం కోసం నిలబడే అవకాశం అందించిందని స్పష్టం చేశారు. తనను కూటమి అభ్యర్ధిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉపాధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలిపారు.