గ్రూప్ -1 విద్యార్థులకు అన్యాయం చేయొద్దు
NEWS Sep 10,2025 07:23 am
గ్రూప్ -1 వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో లోటు పాట్లు జరిగాయని, రీవాల్యుయేషన్ చేయాలని, లేదంటే మళ్లీ పరీక్షలకు వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు వెళ్ల వద్దని, విద్యార్థుల జీవితాలను ఆగం చేయొద్దన్నారు. రాజకీయ రంగు పులమకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.