కేటీఆర్ ను కలవాలంటే రేవంత్ ను అడగాలా..?
NEWS Sep 10,2025 07:19 am
మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్‌రెడ్డిని అడగాలా అని అన్నారు. కేటీఆర్ ను బరా బర్ కలుస్తా, తనను నేను ఎందుకు కలుసు కోకూడదంటూ ప్రశ్నించారు. చాలా సార్లు కేటీఆర్‌ను కలిశాను మళ్ళీ కూడా అవసరం అనుకున్నప్పుడు కలుస్తానని అన్నారు. కవితను టి-టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డినీ టీడీపీలో చేర్చుకున్నట్టేనని పేర్కొన్నారు.