వడ్డాదిలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి సహకారం
NEWS Sep 09,2025 08:55 pm
బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో శ్రీకృష్ణుని ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గతంలో ఆలయానికి 40 సిమెంట్ బస్తాలు అందించగా, ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పలువురు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా మండపంలో గ్రానైట్ వేయించేందుకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, టీడీపీ వడ్డాది టౌన్ అధ్యక్షులు నరేష్ కలిసి సుమారు రూ.1 లక్ష సహకరించారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.