భారత దేశ ఉప రాష్ట్రపతిగా ఎన్డీయే తరపున బరిలో నిలిచిన సీపీ రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. మొత్తం 781 మంది ఎంపీలలో 452 ఓట్లు రాధాకృష్ణన్ కు రాగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. కాగా మొత్తం ఓట్లలో 14 మంది ఎంపీలు ఓటుకు దూరంగా ఉన్నారు. రాధాకృష్ణన్ ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.