సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహా ప్రతిష్ఠ
NEWS Sep 09,2025 02:17 pm
మల్లాపూర్: సిరిపూర్ గ్రామంలో బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ధర్మగురు శ్రీ ఆడే ప్రేమ్ మహారాజ్ భోగ్ బండర్, ప్రాణ ప్రతిష్ఠ వేడుక నిర్వహించారు. మాజీ సర్పంచ్ భూక్యా గోవింద్ నాయక్, బీజేపీ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పాలత నర్సయ్య, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, బంజారా సంఘ నాయకులు పాల్గొన్నారు.