గిరిజన పరివర్తన కోసం ఆది కర్మయోగి అభియాన్ ప్రతిస్పందనాత్మక పాలన కార్యక్రమం
NEWS Sep 09,2025 07:39 pm
గిరిజన పరివర్తన కోసం వ్యక్తులు మరియు సంస్థలకు సాధికారత కల్పించడం ఆది కర్మయోగి అభియాన్ ప్రతిస్పందనాత్మక పాలన కార్యక్రమం లక్ష్యమని బీఎమ్టి మాధవరావు తెలిపారు. పినపాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, నోడల్ ఆఫీసర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి శిక్షణ అధికారులకు శిక్షణ కార్యక్రమము నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రోగ్రాం కొరకు ఎల్లంపల్లి, పొట్లపల్లి, సింగిరెడ్డి పల్లి, గడ్డంపల్లి పంచాయతీలు ఎంపిక అయ్యినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంను ఐటిడిఏ ఏవో రాంబాబు సందర్శించారు.