ప్రాణ హాని ఉందంటూ.బయ్యారం సెక్రటరీ ఆవేదన
NEWS Sep 09,2025 07:05 pm
తన విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించినందుకు తననే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఈ బయ్యారం సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పినపాక మండలం బయ్యారం పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో ఓ ఇంటి విషయంలో హైకోర్టు తీర్పును అమలు పరిచినందుకు తనను చంపేస్తా అని బెదిరిస్తున్నారన్నారు. తనకు ప్రాణ హాని ఉందన్నారు. తన తల్లి, పిల్లలు భయంతో బ్రతుకుతున్నామన్నారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు తెలిపామని సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశారు.