మావోయిస్టు పార్టీ చీఫ్ గా కోరుట్ల తిప్పిరి తిరుపతి
NEWS Sep 09,2025 07:25 pm
కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీ చీఫ్ గా నియమితులయ్యారు. NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న తిరుపతిని పార్టీలో సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్నగా పిలుస్తారు. మావోయిస్ట్ సెంట్రల్ రీజినల్ బ్యూరోకి సైనిక విషయాలలో మార్గనిర్దేశం చేస్తారు. 2010లో దంతెవాడలో జరిగిన మావోయిస్టుల దాడి, 74 మంది సీప్ఫ్ జవాన్ల హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు.