ఉపకార వేతనాలు విడుదల చేయాలి
NEWS Sep 09,2025 06:47 pm
తెలంగాణలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గత మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతూ, కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు, కళాశాల నుండి ర్యాలీగా వెళ్లి కోరుట్ల ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.