పెద్దపల్లి: యూరియాపై రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళనలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో ఉన్న యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా లోడ్ తో లారీ వచ్చింది. అయితే ఆన్ లోడ్ చేసి మరికొన్ని యూరియా బస్తాలను వేరే చోటికి తరలిస్తుంటే రైతులు లారీ నీ అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడి రైతులకు సరిపడ యూరియా అందించిన తర్వాతే లారీని వదిలిపెడతామని అన్నారు.